దివంగత నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దుసారి ఆధ్వర్యంలో నోముల చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళిలుర్పించారు. ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడిన నోముల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. నిరుపేదల ఆశాజ్యోతి నోముల నర్సింహయ్య సేవలు చిరస్మరణీయం అని ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కుల అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీకాంత్ జెల్ల, సంయుక్త కార్యదర్శులు మల్లా రెడ్డి, సతీష్ రెడ్డి బండా, అశ్విన్ కుమార్ ఐర్పుల్ల, చైతన్య ప్రసాద్ రెడ్డి చాకుర్షే, సైది రెడ్డి, సురేష్, నరేష్ పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)