శేఖర్ వర్మ, వైభవి జంటగా ఒ.సాయి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కళ్యాణమస్తు. బోయపాటి రఘుబాబు నిర్మిస్తున్న ఈ సినిమాలోని ముక్కుపుడక అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యంగా హీరో శేఖర్ వర్మ చేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. గల గల నీ మాటల్లో ఉండే పిల్లా జాతర, సుర సుర నీ చూపుల్లో ఉందే మందుపాతర అంటూ మైదలై బాగుందయ్యో బాగుందే నీ ముక్కుపుడక పెట్టేసిందే ఏదో మెళిక అంటూ ఈ పాట సాగుతుంది. అలరాజు లిరిక్స్ అందించిన ఈ పాటను మంగ్లీ. రఘురామ్ పాడారు. ఈ సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. వివిఎన్వి సురేష్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.














