Namaste NRI

భారత్‌తో దౌత్య బంధమే కాదు, సాంస్కృతిక బంధం కూడా

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌పై మరోసారి తన ప్రేమను చాటుకున్నారు. భారతీయ సినిమాలు అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. భారతీయ సినిమాలకు రష్యాలో చాలా పాపులారిటీ ఉందని చెప్పారు. సోచిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పుతిన్‌ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినిమాలంటే తనకు చాలా ప్రేమ అని, అందుకే ఇండియన్‌ సినిమాలను రాత్రింబవళ్లు ప్రసారం చేసేందుకు ప్రత్యేకంగా ఓ టెలివిజన్‌ ఛానెల్‌ను నిర్వహిస్తున్నామని పుతిన్‌ తెలిపారు. భారత్‌ వెలుపల ఆ దేశానికి చెందిన సినిమాలను నిరంతరం ప్రసారాలు చేస్తున్న ఏకైక దేశం బహుశా రష్యానేనని అన్నారు. రెండు దేశాల మధ్య రాజకీయ, దౌత్య సంబంధాలు మాత్రమే గాక, సాంస్కృతిక, మానవీయ బంధం కూడా బలంగా ఉందని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News