ఉక్రెయిన్ యుద్ధం అనేది ఆసియా దేశాల సమస్య కూడా అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ అన్నారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో-ఆపరేషన్ సదస్సుకి మక్రాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వ్యాపార వేత్తలతో మక్రాన్ మాట్లాడుతూ ఆసియా దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడిని వ్యతిరేకిస్తూ ఒక అంగీకారానికి రావాలని ఆయన కోరారు… ఉక్రెయిన్ యుద్ధం అనేది యూరోపియన్ దేశాల సమస్య మాత్రమే కాదు. ఆసియా దేశాల సమస్య కూడా. ఎందుకంటే..ఈ యుద్ధం కారణంగా ప్రపంచమంతా అస్థిరత నెలకొనే అవకాశం ఉంది. అందుకని ఉమ్మడి అంగీకారం కోసం ఫ్రాన్స్ ప్రయత్నిస్తోందని తెలిపారు.
