టిక్‌టాక్ ఓ పాపులర్ వీడియో యాప్ అన్న విషయం తెలిసిందే. అయితే ఆ చైనీస్ యాప్‌పై అమెరికాలో ఓ చట్టాన్ని చేశారు. ఆ యాప్‌ను అమ్మివేయాలని లేదంటే బ్యాన్ చేస్తామని ఇటీవల అమెరికా హెచ్చరించింది. ఆ హెచ్చరికల నేపథ్యంలో టిక్‌టాక్ చైనీస్ కంపెనీ బైట్‌డ్యాన్స్ ఓ ప్రకటన చేసింది. టిక్‌టాక్‌ను అమ్మే ఆలోచ న లేనట్లు ఆ సంస్థ వెల్లడించింది. అమెరికా ఉభయసభలు రూపొందించిన చట్టాన్ని కోర్టులో సవాల్ చేయను న్నట్లు ఇటీవల టిక్ టాక్ కంపెనీ తెలిపింది. టిక్‌టాక్‌ను అమ్మే లేదా బ్యాన్ చేసే చట్టంపై అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశారు. బైట్‌డ్యాన్స్ కంపెనీపై చైనా ప్రభుత్వ ఆధిపత్యం ఏమీలేదని టిక్‌టాక్ పదేపదే వెల్లడించిన విషయం తెలిసిందే.
అమెరికా కోర్టులో టిక్‌టాక్ గురించి పోరాటం చేస్తామని దాని ఓనర్ షోవూ జి చివ్ తెలిపారు. ఓ ఆన్‌లైన్ వీడియో లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. బైట్‌డ్యాన్స్‌లో చైనీస్ వ్యవస్థాపకుడికి 20శాతం మాత్రమే షేర్లు ఉన్నా యి. ఇక మరో 60 శాతం షేర్లు ఇన్వెస్టర్ల వద్ద ఉన్నాయి. దాంట్లో అమెరికా కంపెనీ కార్లిల్ గ్రూపు, జనరల్ అట్లాంటిక్, సుస్‌కెన్నా ఇంటర్నేషనల్ గ్రూపులు ఉన్నాయి. మరో 20 శాతం షేర్లు కంపెనీ ఉద్యోగుల ఆధీనం లో ఉన్నాయి. బైట్‌డ్యాన్స్‌లో ఉన్న అయిదుగురు బోర్డు సభ్యుల్లో ముగ్గురు అమెరికన్లే ఉన్నారు.