
ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగానే గల్ఫ్ కార్మికులకు భరోసా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినం దుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కృతజ్ఞతలు తెలియజేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. సీఎంను కలిసిన వారిలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గల్ఫ్ జేఏసీ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఇతర నేతలు మంద భీంరెడ్డి, రవిగౌడ్ చెన్నమనేని శ్రీనివాసరావు, తోట ధర్మేందర్ ఉన్నారు
