టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంలో ఎన్నారైలు నిరసన తెలిపారు. నిర్మాణ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న వందలాది స్కిల్ల్డ్ వర్కర్స్ ముఖ్యంగా చంద్రబాబు ప్రవేశ పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఇండస్ట్రియల్ ఎలెక్ట్రిసియాన్స్, హెవీ ఎక్విప్మెంట్ ఆపేటర్స్, వెల్డర్స, ఇతర సాంకేతిక నిపుణులు నిరసన కార్య క్రమంలో భారీగా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చంద్రబాబును తప్పుడు కేసులతో వేధించడం అన్యాయం, బాధాకరమని తీవ్ర అందోళన వ్యక్తం చేశారు.
చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను ఖండించిన వారు, చంద్రబాబు ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్‌లో శిక్షణ పొందిన తాము నేడు సౌదీలో సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్నామని తెలిపారు. ఇందుకు కారణమైన చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం తెలుగు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో పాల్గొన చంద్రబాబు అబిమానులు అందరికి పేరుపేరునా సౌదీ అరేబియా టీడీపీ అధ్యక్షులు ఖాలిద్ సైఫుల్లా, ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ తమ ధన్యవాదాలు తెలిపారు.