అమెరికాలోని డల్లాస్లో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ తెలుగు ప్రజలు నిరసన తెలిపారు. చంద్రబాబుకు మద్దతుగా రెండు వేల మంది తెలుగు ప్రజలు నిరసనలో పాల్గొన్నారు. న్యాయం కావాలి-చంద్రబాబు విడుదల కావాలంటూ నినాదాలు చేశారు. డల్లాస్ వీధుల్లో నల్ల దుస్తుల్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
