పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ నేపాల్, బ్రిటన్, ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు, వారి మద్దతుదారులు ధర్నాలు చేశారు. భారత దేశ జాతీయ జెండాలు, బ్యానర్లు, ప్లకార్డులను చేతపట్టి అమాయక పౌరులను పొట్టన బెట్టుకోవడంపై పాక్‌పై తీవ్రంగా మండిపడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయా దేశాల్లోని పాక్ రాయబార కార్యాలయాల ముందు ఎన్నారైలు నిరసన తెలిపారు.

లండన్‌లోని పాకిస్థాన్ హై కమిషన్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న భారత్, యూదు పౌరులను పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ అధికారి తైమూర్ రాహత్ తీవ్రంగా అవమానించారు. కమిషన్ బయట ఆందోళనలో పాల్గొన్న సుమారు 500 మంది ఆందోళనకారులను ఉద్దేశించి ఎగతాళిగా పీక కోస్తా అంటూ సైగలు చేసి చిల్లరగా ప్రవర్తించారు. ఆయన చర్యలను ఢిల్లీ మంత్రి మంజీందర్ సింగ్ తీవ్రంగా ఖండిస్తూ పాకిస్థానీలు మొదట తమ పీకలను కాపాడుకోవాలని అన్నారు.
