Namaste NRI

తానా 23 కాన్ఫరెన్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు!

నిర్వసన, వాసాన్న సంక్షేమ స్వాప్నికుడు..

నిష్క్రియా ప్రచ్ఛన్న సంగ్రామ శ్రామికుడు..

నిరంతర సంఘశ్రేయ సంధాన భావకుడు

మన అన్న తారక రాముడు  

జులై 8, శనివారం ఉదయం 10 గంటలకు పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న తానా 23 కాన్ఫరెన్స్‌ లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తెలుగు వారి  ఇలవేలుపు .. తెలుగుదనానికి ప్రతిరూపు అన్న  నందమూరి తారక రామునికి  ఘనంగా నివాళిలర్పిస్తూ ఎన్నో ఆకర్షణీయమైన కార్యక్రమాలు నిర్వహిచబడుతున్నాయి. అద్భుతమైన తారక రాముని ప్రాంగణం, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కకరణ, ఎన్టీఆర్ జీవితం లోని ముఖ్యమైన మైలురాళ్లను వర్ణించే అరుదైన ఛాయా చిత్రాల ఫోటో ఎగ్జిబిట్, ఎన్టీఆర్ యొక్క శాశ్వతమైన సాంస్కృతిక ప్రభావానికి నివాళులర్పిస్తూ, నృత్యం, సంగీతం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న ఎన్‌టిఆర్‌ ఆశయ స్పూర్తితో అర్థవంతమైన సేవా కార్యక్రమాలు, ఫోటో బూత్‌లు వెరసి తానా లోకంలో  తారక రాముని శతజయంతి ఉత్సవాలు ఒక చారిత్రకమైన ఘట్టం !!! ఒక యుగపురుషుడు కి నివాళులు అర్పించే మహత్తర అవకాశం. మీ సహకారం మరియు భాగస్వామ్యం కోరుకుంటూ  .. రండి … కదలి రండి !!!!

https://tanaconference.org/event-registration.html

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events