ఎన్‌ఆర్‌ఐ టీడీపీ- సౌదీ అరేబియా ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ఈ నెల 12న ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సౌదీ అరేబియా ఖాలిద్ సైపుల్లా ఆధ్వర్యంలో డమ్మామ్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రవికుమార్ వేమూరు హాజరయ్యారు. ఏపీఎన్‌ఆర్‌టీ మాజీ చైర్మన్, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖోబర్, హస నగరాల నుంచి ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కుమార్ వేమూరి మాట్లాడుతూ టీడీపీకి అందరూ అండగా ఉండాలని కోరారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తనతో పాటు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఖాలిద్ సైపుల్లా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా టీడీపీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కొనియాడారు. రాధాకృష్ణ మాట్లాడుతూ పటేల్, పట్వారీ, వ్యవస్థల రద్దుతో పాటు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చేస్తున్న విధ్వంసక పాలన, మళ్లీ చంద్రబాబును సీఎంగా చేయాల్సిన ఆవశ్యకత గురించి తెలిపారు.
ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ సౌదీ అరేబియా కార్యదర్శి భాస్కర్, డమ్మామ్ కోఆర్డినేటర్ జాకిర్ హుస్సేన్, మహ్మద్ అజామ్, సుబ్రహ్మణ్యం, రాజా ఆగ, సిద్దూక్యూ, హనుమంతరావు, ఇక్బాల్, హనుమంత, అబ్దుల్ జమీల్, సాహిక్ అదిల్, ముజమీల్, కొసరు అలీ, షఫీక్, నరసింహ, రమణ, సత్య, నరేశ్, రావు, ప్రసాద్, జాన్సన్, విక్టర్, సత్యనారాయణ, షేక్ అహ్మద్, మహ్మద్ మాలిక్, చాన్ బాషా, అబ్దుల్, మజ్రుల్ తదితరులు పాల్గొన్నారు.