అగ్రహీరో ఎన్టీఆర్ మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ఆసియాలో 2023 టాప్ 50లో నిలిచిన నటుల జాబితాను ఏషియన్ వీక్లీ ప్రకటించింది. అందులో 25వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే, తెలుగు సినిమా నుంచి ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక నటుడు ఎన్టీఆర్ మాత్రమే. ఈస్టర్న్ ఐ 2023 పేరిట ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో షారుక్‌ఖాన్ ప్రథమ స్థానంలో నిలవగా, పలువురు బాలీవుడ్ నటులు కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు. దీనితోపాటుగా అమెరికన్ మ్యాగజైన్ వెరైటీ ఇటీవల ప్రకటించిన 500మంది అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో తారక్, చోటు దక్కడం విశేషం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)