Skip to main content

Namaste NRI

ఎన్టీఆర్‌ మరో అరుదైన ఘనత

అగ్రహీరో ఎన్టీఆర్‌ మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు. ఆసియాలో 2023 టాప్‌ 50లో నిలిచిన నటుల జాబితాను ఏషియన్‌ వీక్లీ ప్రకటించింది. అందులో 25వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అయితే, తెలుగు సినిమా నుంచి ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న ఏకైక నటుడు ఎన్టీఆర్‌ మాత్రమే. ఈస్టర్న్‌ ఐ 2023 పేరిట ఈ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో షారుక్‌ఖాన్‌ ప్రథమ స్థానంలో నిలవగా, పలువురు బాలీవుడ్‌ నటులు కూడా ఇందులో చోటు దక్కించుకున్నారు. దీనితోపాటుగా అమెరికన్‌ మ్యాగజైన్‌ వెరైటీ ఇటీవల ప్రకటించిన 500మంది అత్యంత ప్రతిభాశీలుర జాబితాలో తారక్‌, చోటు దక్కడం విశేషం.

Social Share Spread Message

Latest News