Namaste NRI

దోహాలో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు.. మినీ మహానాడు

తెలుగుదేశం పార్టీ పండుగ మినీ మహానాడు మరియు తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, తెలుగు వారి కీర్తిని దశ దిశలు వ్యాపింప చేసిన నందమూరి తారక రాముని 102వ జయంతి వేడుకలు ఖతార్ రాజధాని దోహాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కోడెల శివరామకృష్ణ హాజరయ్యారు. ఎన్టీఆర్‌ కు ఘననివాళులు అర్పించి, మాతెలుగుతల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ప్రారంభమైన సభ ఎంతో ఉత్సహంగా, ఉల్లాసంగా పండుగ వాతావరంలొ సాగింది. ఈసందర్బంగా “తారకరామం” పుస్తకఆవిష్కరణ విశిష్ట అతిధి చేతుల మీదగా జరిగింది.

ఈ సందర్భంగా కోడెల శివరామకృష్ణ ప్రసంగిస్తూ ఎన్టీఆర్‌ కారణ జన్ముడని తెలువారి ఆత్మ గౌరవం ఢిల్లీ విధుల్లో తాకట్టు పెట్టబడుతుంటే తట్టుకోలేక, బడుగు బలహీన వర్గాల వారు ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే ఓరిమి పట్టలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టారని గుర్తుచేశారు. అయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు, కూడు, గుడ్డ, గూడు, రైతులకు ఉచిత విదుత్ వంటి పథకాలు దేశానికే ఆదర్శప్రాయం అయ్యాయ ని వివరించారు. ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తూ, రాష్ట్రాన్ని అధివృద్ధి పదంలో నడిపించటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ప్రపంచానికే ఆదర్శప్రాయమని శ్రోతలకు వివరించారు. 1982 లో ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించి రాజకీయాలలో కీలక మార్పులు తీసుకురావాలనే లక్షసాధనలో విద్యావేత్తలు, సమాజంలో ఉన్నతమైన వారికోసం చూస్తున్న తరుణంలో, తన తండ్రి కోడెల శివప్రసాద్ గురించి తెలుసుకొని పార్టీలోకి ఆహ్వానించి సముచిత స్థానమిచ్చి గౌరవించారని చెప్పుకొచ్చారు. కోడెల శివప్రసాద్ కూడా తనొకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఒకవైపు పార్టీని కార్యకర్తలని కాపాడుకొంటూ అభివృద్ధి పదంలో సాగేందుకు చేసిన కృషి నేటి తరానికి ఆదర్శ ప్రాయమన్నారు, లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లిమ్కా బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ తోపాటు గిన్నిస్ బూన్ అఫ్ వరల్డ్ రికార్డు అని చెప్పుకొచ్చారు.

తన ప్రాణమున్నంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తానని, కొన్ని కష్టాలొచ్చినప్పుడు పార్టీని మార్చటమంటే అది కన్నతల్లిని మార్చటమేనని చెప్పుకొచ్చారు. తన మొబైల్ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని తనకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చని, అందరికి తాను ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని హామీనిచ్చారు

ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించిన ఖతార్ కార్యవర్గాన్ని ముఖ్యంగా ఖతార్ ప్రెసిడెంట్ గొట్టిపాటి రమణయ్య , వైస్ ప్రెసిడెంట్ మద్దిపోటి నరేష్, జనరల్ సెక్రటరీ పొనుగుమాటి రవి, జీసీసీ కౌన్సిల్ మెంబెర్ మల్లిరెడ్డి సత్యనారాయణ, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ దాసరి రమేష్, సీనియర్ నాయకులు ఎలమంచిలి శాంతయ్య, నరసింహారావు తదితరులను అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events