Namaste NRI

ఎన్టీఆర్- నీల్‌…ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ ప్రారంభం

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌నీల్‌ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చేసింది. ఎన్టీఆర్‌నీల్‌ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు.ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించనున్నట్టు అభిమానులకు తీపి కబురు చెప్పారు మేకర్స్‌. ప్రస్తుతం ప్రశాంత్‌నీల్‌ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారట. అది కూడా చివరిదశకు చేరుకుందట.

తారక్‌ మాస్‌ ఇమేజ్‌ని దృష్టిలోపెట్టుకొని, కేజీఎఫ్‌  ఫ్రాంచైజీకి దీటుగా భారీ స్కేల్‌తో, అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కనుందని మేకర్స్‌ చెబుతున్నారు. మైత్రీ మూవీమేకర్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. సినీప్రియులు, అభిమానుల అంచనాలను మించేలా ఈ సినిమా ఉండబోతున్నదని మేకర్స్‌ చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress