ఎన్ఆర్ఐ తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహా నటుడు , తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు . ప్రజాహిత పాలన, సంక్షేమ పథకాలకు ఆద్యుడుగా తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా జాతీయ రాజకీయాలకు దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఎన్ఆర్ఐ తెలుగుదేశం గల్ఫ్ కౌన్సిల్ సభ్య దేశాలు సౌదీ అరేబియ, బహ్రైన్,కువైట్, ఖతార్, ఓమన్, యూఏఈ లో పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించారు. రాజకీయాల్లో మహిళలు. బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెంచేందుకు, అట్టుడుగు వర్గాల సంక్షేమం అందించేందుకు, మహిళలకు ఆస్తి హక్కు, బి సి రిజర్వేషన్లు రూ. 2 కి కిలో బియ్యం వంటి పథకాలతో సమసమాజం స్థాపనకు ఎన్టీఆర్ కృషి ని ఈ సందర్భంగా కొనియాడారు.

యూఏఈ


సౌది అరేబియా


బహ్రైన్


ఒమన్















