
తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి కార్యక్రమాన్ని దుబాయ్‌లోని ఎన్నారై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విభాగం అత్యంత భక్తిశ్రద్ధల తో నిర్వహించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, సభ్యులందరూ పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్నారై టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు, జ్ఞాపకాలు తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబాయ్‌లో నివసిస్తున్న పలువురు ఎన్నారై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















