Namaste NRI

కోర్టు తీర్పుతో ఒబామా దంపతుల ఆవేదన

జాతి ఆధారంగా కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడాన్ని తప్పుపడుతూ అమెరికాలోని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా దంపతులు స్పందించారు. ఈ తీర్పు తమ హృదయాన్ని ముక్కలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతితో సంబంధం లేకుండా విద్యార్థులందరూ విజయం సాధించడానికి ఈ విధానాలు అవసరమన్నారు. సమానత్వంతో నిండిన సమాజ నిర్మాణానికి ఈ తరహా విధానం (ఒక జాతిని ఉద్దేశించి జరుగుతున్న ప్రక్రియ) ఎన్నటికీ సమాధానం కాదు. కానీ తరాల పాటు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో స్థానం పొందలేని విద్యార్థులకు ఈ విధానాలు అవకాశాన్ని కల్పిస్తాయి. సుప్రీంకోర్టు తీర్పుతో మా ప్రయత్నాలను రెట్టింపు చేయాల్సి ఉంది అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events