Namaste NRI

అధ్యక్షుడికి తెలియకుండా అక్కడ దాచి పెట్టలేరు : ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు

గ్రహాంతర జీవులు(ఏలియన్స్‌) ఉన్నది నిజమేనని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే అవి ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదన్నారు. ఇటీవల యూట్యూబర్‌ బ్రెయిన్‌ టైలర్‌ కొవెన్స్‌ ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ కామెంట్స్‌ చేశారు. అమెరికా వైమానిక దళ స్థావరమైన నెవెడాలోని ఏరియా 51 లో ఏలియన్స్‌ ఉన్నారనే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఆ స్థావంలో భూగర్భ సౌకర్యం లేదు.

అపారమైన కుట్ర ఉంటే తప్ప ఏలియన్స్‌ను అమెరికా అధ్యక్షుడికి తెలియకుండా అక్కడ దాచి పెట్టలేరు అని ఆయన వెల్లడించారు. భూమి, సముద్రం, రోదసి, ఆకాశంలో విమానాలను లేదా సహజ దృగ్విషయాలను వెంటనే గుర్తించకపోవడానికి సంబంధించిన యూఏపీ పద్ధతిపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఒబామా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2020 నుంచి SETI@Home ప్రాజెక్ట్‌ ద్వారా వేలాది స్వచ్ఛంద కార్యకర్తలు అసాధారణ రేడియో సంకేతాలను గుర్తించడం ద్వారా ఏలియన్స్‌ జాడను వెతికే ప్రయత్నం చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events