
తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఓదెల-2. అశోక్‌తేజ దర్శకుడు. శనివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మూవీ క్రియేటర్, ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ ఓదెల సినిమా నాకు ఓ ఎమోషన్. నేను ఆ ఉర్లో పుట్టిపెరిగాను. ఎంతో ప్రేమతో, గౌరవంతో ఈ సినిమా తీశాను. ఓదెల గ్రామంలో పెద్ద కష్టం వస్తే ఊరి ఇలవేల్పు ఓదెల మల్లన్న నాగసాధువు పాత్ర ద్వారా ఎలా పరిష్కరించాడన్నదే చిత్ర కథాంశం. కథ, కంటెంట్, విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.భైరవి పాత్రలో తమన్నా అభినయం, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ప్రధానాకర్షణలుగా నిలుస్తాయి అన్నారు.

తమన్నా మాట్లాడుతూ ఓ పల్లెటూరి కథను ఎక్సైయిటింగ్‌గా చెప్పడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇది ఈజీ జోనర్ కాదు. ఇందులో భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించే సినిమా అవుతుంది అని చెప్పింది. కుంభమేళాలో రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని నిర్మాత డి.మధు తెలిపారు. హెబ్బాపటేల్, వశిష్ట ఎన్ సింహ, యువత, నాగ మహేష్ తదితరులు నటించారు. ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి నిర్మాణం : మధు క్రియేషన్స్, సంపత్‌నంది టీమ్ వర్క్స్, నిర్మాత: డి.మధు, క్రియేటర్: సంపత్‌నంది, దర్శకత్వం: అశోక్‌తేజ.
