మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్, మధు క్రియేషన్స్‌పై తెరకెక్కిస్తున్నారు. అశోక్ తేజ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే మేకర్స్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓం నమ: శివాయ అంటూ తమన్నా శివశక్తి లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో తమన్నా మహదేవ్‌కు పరమభక్తురాలిగా, ఓదెల సద్గుణ రక్షకురాలిగా కనిపించనుందని తెలియజేశారు. ఓదెల ప్రపంచం నుండి శివశక్తికి సంబంధించిన ఎక్జయిటింగ్ న్యూస్ రాబోతుందని ప్రకటిం చారని తెలిసిందే. తాజాగా తమన్నా శివశక్తి రూపంలోకి ఎలా మారిందని తెలియజేస్తూ, మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఓదెల 2 సెకండ్ షెడ్యూల్ షూట్ మొదలైంది. ఈ చిత్రంలో వశిష్ఠ ఎన్ సింహా, హరి ప్రియ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాంతార చిత్రానికి గూస్‌బంప్స్ తెప్పించే మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూర్చిన అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొ న్నాయి. ఓదెల 2 షూటింగ్‌ను ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కాశీలో మొదలుపెట్టారని తెలిసిందే.