శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో కలిసి నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. శ్రీహర్ష కొనుగంటి దర్శకు డు. వి.సెల్యులాయిడ్‌తో కలిసి సునీల్ బులుసు నిర్మిస్తు న్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో లాంచ్‌చేశారు. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడారు. ఈ సినిమాని పూర్తిగా ఇంగ్లిష్‌లో తీసి హాలీవుడ్‌లో విడుదల చేయాలని అనుకున్నాం. పాన్ వరల్డ్ సినిమాలా ఎక్కడ విడుదల చేసినా ఆడే కథ ఇది. ఇలాంటి పాయింట్‌తో ఇప్పటివరకూ సినిమా రాలేదు అన్నారు. ఇంకా చెబుతూ గుప్త నిధులకోసం ముగ్గురు శాస్త్రవేత్తలు ఏం చేశారు? అనే ప్రశ్నకు సమాధానమే ఈ కథ. ముగ్గురు శాస్త్రవేత్తలుగా నేను, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించాం. మా పాత్రకు ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అవుతారు. రెండు గంటలపాటు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే సినిమాఇది. సాంకేతికంగా అద్భుతంగా ఉంటుందీ సినిమా అన్నారు. ఏడాదిన్నర కష్టపడి ఈ సినిమా చేశామని, అందరికీ నచ్చే సినిమా అవుతుందని ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ అన్నారు. దర్శకుడు కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: సన్నీ ఎం.ఆర్. ఈ చిత్రం మార్చి 22న విడుదల కానుంది.














