అగ్రరాజం అమెరికాలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్నది. తొలికేసు నవంబర్ 25న కాలిఫోర్నియాలో నమోదయింది. ఇప్పుడు అది మిన్నెసొటా, న్యూయార్క్, కొలరాడోకు విస్తరించింది. ఆఫ్రికా దేశాల నుంచి కాలిఫోర్నియాకు వచ్చిన వ్యక్తికి పాజిటివ్ రాగా, దేశీయంగా తొలి కేసు మిన్నెసొటాలో నమోదయిందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. న్యూయార్క్‌లో ఇప్పటి వరకు ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 67 ఏండ్ల మహిళ స్వల్ప లక్షణాలతో ఆమె బాధపడుతున్నారని చెప్పారు. ఆమె ఈ మధ్యే దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చారని తెలిపారు. నవంబర్ 25న ఆమె అమెరికాకు తిరిగి వచ్చారని, గత వారం అమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)