కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పునరుద్ధరించాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని నిర్ణయించినట్టు డీజీసీఏ వెల్లడిరచింది. అయితే కొత్త తేదీలను తర్వాత తెలియజేయనున్నట్టు పేర్కొంది. డెల్టా కంటే అత్యంత వేగంగా పలు దేశాలకు ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో ఇప్పటికే షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమాన సర్వీసుల పునరుద్ధరణను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు డీజీసీఏ ఒక ప్రకటనలో తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)