Namaste NRI

అనిల్‌ నియామకం పై… తెలంగాణ ఎన్నారై సమాజం హర్షం

తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎన్‌ఆర్‌ఐ అనిల్‌ కుర్మాచలంకు తెలంగాణ జాగృతి ఖతర్‌ అధ్యక్షులు నందిని అబ్బగౌని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  మలి దశ తెలంగాణ ఉద్యమ  సమయం నుంచి ఖండాంతరాలలో తెలంగాణ వాదాన్ని అనిల్‌ ఎంతో బలంగా వినిపించారన్నారు. అతడికి దక్కిన ఈ గౌరవం ప్రతి ప్రవాసీ బిడ్డకు దక్కిన గౌరవమని ఆమె వ్యాఖ్యానించారు. అనిల్‌ నియామకంపై తెలంగాణ ఎన్నారై సమాజం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారైలను అభివృద్ధిలో సైతం భాగం చేయడం గర్వంగా ఉందన్నారు. అదే సమయంలో ప్రవాసుల సంక్షేమానికి నిర్దిష్టమయిన ప్రణాళికతో చర్యలు తీసుకోవలసిందిగా, మఖ్యంగా గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events