వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నచిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మానుషి చిల్లార్ కథానాయిక. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ పతాకాలపై సందీప్ ముద్దా నిర్మించారు. ఈ సినిమాలోని వందేమాతరం అనే తొలి గీతాన్ని వాఘా సరిహద్దుల్లో ఆవిష్కరించారు. అక్కడ రిలీజ్ చేసిన మొట్ట మొదటి పాటగా చరిత్ర సృష్టించిందీ గీతం. దేశభక్తి ప్రధానంగా ఈ పాట సాగింది. వైమానిక దళం పెద్ద యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు చూపే ఈ పాటను దేశ రక్షణకు పోరాడే ధైర్యవంతులందరికీ నివాళి అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంతో హిందీలో అరంగేట్రం చేస్తున్న వరుణ్ తేజ్ ఈ పాటలో యూనిఫాంలో కనిపించారు. మానుషి చిల్లార్ యుద్ధంలో ఉన్న తన ప్రియుడు (వరుణ్ తేజ్) గురించి ఆందోళన చెందే రాడార్ ఆఫీసర్‌గా కనిపించింది. రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా, మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. ఈ పాటను తెలుగులో అనురాగ్ కులకర్ణి, హిందీలో సుఖ్వీందర్ సింగ్ పాడారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. తెలుగు, హిందీలో ఫిబ్రవరి 16న విడుదల కానుంది.
