భారతదేశానికి చెందిన సోనియా గుప్తా అనే మహిళకు 2003లో వివాహం చేసుకున్నారు. అనంతరం భర్తతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడి వెళ్లాక అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. పెళ్లై 17 ఏళ్లు అయినప్పటికీ కూడా వైవాహిక సంబం ఆమెకు సంతృప్తినివ్వలేదు. ఇక తన భర్తతో ఉండలేనని భావించి విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం కుటుంబ సభ్యులు చెప్పగానే తీవ్రంగా ఆమెను దూషించారు. విడాకులకు అంగీకరించలేదు. ఆ సమయంలో సోనియాకు స్నేహితులు అండగా నిలిచారు. ఆమెకు ఓ పరిష్కార మార్గాన్ని చూపించారు.
ఏషియన్ సింగిల్ పేరెంట్ నెట్‌వర్క్ నుంచి కూడా ఆమెకు మద్దతు లభించింది. మూడేళ్ల సుదీర్ఘ పోరాటం చేయగా, ఎట్టకేలకు విడాకులు వచ్చాయి. విడాకులు తీసుకున్న వెంటనే నా 17 ఏళ్ల వైవాహిక బంధం నుండి నాకు విముక్తి లభించింది అని తెలిపారు. విడాకులు వచ్చిన సందర్భంగా లండన్‌లోని తన నివాసంలో సోనియా స్నేహితులకు ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో ఆమె ధరించిన డ్రెస్‌పై కూడా పైనల్లీ డివోర్స్‌డ్ అనే ట్యాగ్ కూడా డిజైన్ చేయించారు.