హరీష్ వినయ్, ప్రియాంక డే జంటగా శ్యామ్ మండల దర్శకత్వంలో రూపొందిన చిత్రం మహా లింగాపురం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహాలింగాపురం లుక్ ఆసక్తికరంగా ఉంది. నా దగ్గర పనిచేసిన శ్యామ్‌కు ఈ చిత్రంతో మంచి సక్సెస్ రావాలి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సస్పెన్స్ అండ్ యాక్షన్‌తో కూడిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. మహా లింగాపురం కథేమిటి? అక్కడ ఏం జరిగిందన్నది తెరపైనే చూడాలి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేస్తాం అన్నారు. ఆయన ట్రూ, అం అ: తర్వాత చేసిన సినిమా ఇది. సందీప్ కంగుల సంగీతం అందించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. సాయిదత్త క్రియేషన్స్ బ్యానర్‌పై పునీత్ కాడిగారి, మాస్టర్ మనో రూపేష్ సమర్పణలో ప్రవీణ్ రెడ్డి కాడిగారి నిర్మించారు. కెమెరా: శివా రెడ్డి శవనం, ఎడిటర్: జేపీ మ్యూజిక్, సందీప్ కంగుల, ఫైట్స్: రవి ఎల్పురి, నందు డాన్స్: కపిల్ నిర్మాత: ప్రవీణ్ రెడ్డి కాడిగారి.














