మంచు మోహన్ బాబు అండ్ విష్ణు టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. కాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భం గా కన్నప్ప కామిక్ బుక్ ను లాంఛ్ చేశారు. మోహన్‌బాబు, విష్ణు దంపతులతోపాటు పలువురు చిత్రయూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్పలో మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్ ఇతర నటీన టులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కి స్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.