Skip to main content

Namaste NRI

మోహన్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా.. కన్నప్ప  కామిక్ బుక్ ను లాంఛ్

మంచు మోహన్‌ బాబు అండ్ విష్ణు‌ టీం నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ముఖేశ్ కుమార్ సింగ్‌ దర్శకత్వం.  ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. కాగా కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు పుట్టినరోజు సందర్భం గా కన్నప్ప కామిక్ బుక్ ను లాంఛ్ చేశారు. మోహన్‌బాబు, విష్ణు దంపతులతోపాటు పలువురు చిత్రయూనిట్‌ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచు విష్ణు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న కన్నప్పలో మోహన్‌బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, మోహన్‌ లాల్‌, నయనతార, మధుబాల, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ ఇతర నటీన టులు కీ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ సమకూరుస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ,  అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కి స్తున్న ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు.

Social Share Spread Message

Latest News