అశోక్ గల్లా నటిస్తున్న చిత్రం దేవకీ నందన వాసుదేవ. వారణాసి మానస కథానాయిక. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. సోమినేని బాలకృష్ణ నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే విడుదల చేసిన తొలి పాటకు ఆడియన్స్‌లో మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రెండో పాటను విడుదల చేశారు.జై కృష్ణ.. జై బోలో కృష్ణ.. కృష్ణ కృష్ణ అంటూ సాగే ఈ పాటను రఘురామ్ అడ్వకేట్ రాయగా, భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. స్వరాగ్ కీర్తన్ ఆలపించారు. సినిమాలో కృష్ణజన్మాష్టమి సందర్భంగా వచ్చే పాట ఇదని చిత్రీ కరణ చెప్పకనే చెబుతున్నది. యష్ మాస్టర్ డ్యాన్స్ మూమెంట్స్, అశోక్ గల్లా ఎనర్జీ పాటకు కొత్త ఊపును తెచ్చాయని మేకర్స్ చెబుతున్నారు.

స్పిరిచ్యువల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అర్జున్ జంధ్యాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: ప్రశాంత్‌వర్మ, మాటలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, నిర్మాణం: లలితాంబిక ప్రొడక్షన్స్.
