ఫేస్‌బుక్ మాతృసంస్థ అయిన మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మెటా ఇప్పటికే పలు రంగాలకు చెందిన ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్‌ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్‌మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులను తొలగించింది. తాజాగా సిలికాన్ యూనిట్ లోని మెటావర్స్ లో ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ సిద్ధమైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే అంతర్గత చర్చల్లో ఉద్యోగులకు తొలగింపుపై సమాచారం అందించినట్లు సంస్థలోని ఇద్దరు ఉన్నతాధికారులు వెల్లడించినట్లు నివేదికలు తెలిపాయి. తొలగింపు జాబితాను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నాయి.