కరోనా వచ్చిన తరువాత ఐటీ రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రముఖ కంపెనీలు , పేరున్న కంపెనీలు కూడా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఎప్పుడూ ఏం జరుగుతుందో తెలియక ఐటీ ఉద్యోగులు చాలా మంది కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలన్ని కూడా పెద్ద మొత్తంలో ఉద్యోగుల్ని పీకి ఇంటికి పంపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ విషయం నెమ్మదించినప్పటికీ, మళ్లీ తిరిగి ఉద్యోగుల్ని ఏకి పారేసే పని లో పడ్డాయి దిగ్గజ కంపెనీలు. తాజాగా ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పటికే తమ సంస్థలోని వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన గూగుల్ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను నియమించేందుకు ఏర్పాటు చేసిన గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుంచి కూడా వందలాది మందిని తొలగిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థ నియామకాలు బాగా తగ్గుముఖం పట్టినందున రిక్రూటింగ్ టీమ్ సంఖ్యను కూడా కుదించాలని నిర్ణయించినట్టు గూగుల్ తెలిపింది. కొత్తగా ఎవర్ని తీసుకోవడం లేదని కూడా తెలిపింది.