అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు జూనియర్ ట్రంప్‌నకు మరోసారి తెల్లటిపొడి ఉన్న బెదిరింపు లేఖ వచ్చింది. ఫ్లోరిడాలోని జూనియర్ ట్రంప్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు ఓ లేఖను పంపారు. దాన్ని తెరవగా తెల్లటిపొడి అంటుకుంది. అప్రమత్తమైన అత్యవసర సిబ్బంది ఆ పొడిని స్వాధీనం చేసుకుని పరీక్షలు నిర్వహించారు. పొడి ఎంటన్నది తెలియరానప్పటికీ అంత ప్రమాదకరం కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా ట్రంప్ కుమారులకు దుండగులు ఇలా తెల్లపొడిని పంపడం ఇదే తొలిసారి కాదు. 2016, 2018ల్లో కూడా ఇలాంటి లేఖలే పంపారు. 2018లో ఈ లేఖను తెరిచిన జూనియర్ ట్రంప్ మాజీ భార్య కొద్దికాలం అనారోగ్యంతో బాధపడ్డారు. 2016లో ట్రంప్ టవర్‌కు సైతం రెండు సార్లు ఇలాంటి లేఖలు వచ్చాయి.














