Namaste NRI

అమెరికాలో లక్ష ఉద్యోగాలకు ముప్పు

అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ)   మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ బ్యాంక్ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్లపై పడుతుందని, లక్ష ఉద్యోగులు లేఆఫ్‌కు  గురయ్యే ప్రమాదం ఉందని వై కాంబినేటర్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ భారత్‌లోని  200 స్టార్టప్లతో పాటు అమెరికాలో వేలాది స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టింది. ఈ లేఖపై 56 వేల ఉద్యోగులు కలిగిన 1,200 సంస్థల సీఈవోలు సైతం సంతకాలు చేశారు.  సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ వై కాంబినేటర్ సంస్థ సీఈవో, ప్రెసిడెంట్ గార్రీ టాన్ అమెరికా ట్రెజరీ కార్యదర్శి జనెట్ యెల్లెన్, ఇతర ఉన్నతాధికారులకు లేఖ రాశారు.

Social Share Spread Message

Latest News