Namaste NRI

ఒకే ఒక జీవితం టీజర్ విడుదల

శర్వానంద్‌, రీతు వర్మ జంటగా నటిస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. తమిళంలో కణం పేరుతో తెరకెక్కుతోంది. కొంత గ్యాప్‌ తర్వాత ఒకే ఒక జీవితం సినిమా కథతో పాటు క్యారెక్టర్‌ నచ్చడంతో అక్కినేని అమల కీలక పాత్రలో నటిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు. కథ ఏంటనేది  క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. టీజర్‌లో టైం మిషన్‌ కాన్సెప్ట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది.  థ్రిల్‌కి గురిచేసే అంశాలతో పాటు లవ్‌, చక్కటి ఫ్మామిలీ ఎమోషన్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుందని టీజర్‌ చూస్తే అర్థమవుతోంది. నాజర్‌తో టీజర్‌ నేరేట్‌ చేయించి ఆసక్తి కలిగించారు. శర్వా తన మార్క్‌ నేచురల్‌ పర్పామెన్స్‌తో ఆకట్టుకోగా మంచి క్యారెక్టర్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న అమల అలరించనున్నారు. సుజీత్‌ సారంగ్‌ విజువల్స్‌, జేక్స్‌ బిజోయ్‌ బ్యాగ్రౌండ్‌ స్కార్‌ బాగున్నాయి. శ్రీ కార్తిక్‌ దర్శకుడిగా పనిచేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్స్‌పై ఎస్‌.ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌. ప్రభు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి పెళ్లిచూపులు డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ డైలాగ్స్‌ రాస్తుండడం విశేషం.  త్వరలో ఈ సినిమా తెలుగు, తమిళ్లో రిలీజ్‌ కానుంది. ఈ కార్యక్రమంలో సతీష్‌, ఎడిటర్‌ శ్రీజిత్‌, ఛాయాగ్రాహకుడు సుజిత్‌, సంగీత దర్శకుడు జేక్స్‌ బిజోయ్‌, నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events