కెనడా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ (ఓటీఎఫ్) ఆధ్వర్యంలో దీపావళి పండుగ సంబరాలు టొరంటోలోని ఈస్ట్‌డేల్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు 1000కి పైగా తెలుగు కమ్యూనిటీకి చెందిన వారు బంధుమిత్ర సమేతంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భావన పగిడేలా, అపర్ణ కందుల, రిందా శాంతపురం, విలోక్ చల్ల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మహిళా సమన్వయకర్తలు ఝాన్సీ బదాపురి, దీప సూదిరెడ్డి, పద్మిని నారు, గీత రెడ్డిచెర్ల, శ్రీదేవి నీల, లావణ్య ఆలూరిల జ్యోతి ప్రజ్వలనతో దీపావళి వేడుకలు ప్రారంభం అయ్యాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో అన్ని వయసుల తెలుగు పిల్లలు, కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. నృత్యాలు, సంగీతం, సంప్రదాయ కళారూపాలు వేడుకకు మరింత వైభవాన్ని చేకూర్చాయి.

ఈ సందర్భంగా సమన్వయకర్తలు ప్రవీణ్ నీల, మురళీధర్ పగిడేలా మాట్లాడుతూ ఒంటారియో కెనడా తెలుగు ప్రజల సంఘటిత శక్తిని కొనియాడారు. ఓటీఎఫ్ సంస్థకు అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలకు విశిష్ట అతిథులుగా ఐసిఐసిఐ బ్యాంకు కెనడా సీఈఓ హిమదర్ మద్దిపట్ల, వారి సతీమణి అనిత, ముఖ్య అతిధులుగా పికరింగ్ ఎంపీ జునైటా నాథన్, రీజినల్ కౌన్సిల్ మలీహా షాహిద్ హాజరయ్యారు.


హిమదర్ మాట్లాడుతూ ఇండో–కెనడియన్ల అభివృద్ధికి ఐసిఐసిఐ బ్యాంక్ కెనడా అండగా నిలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు వివిధ సేవల ద్వారా మన కమ్యూనిటీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. వారి అభివృద్ధికి తోడ్పడుతుంది. ఒంటారియో ప్రజలకు ఉపయోగపడే ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తోంది అని అన్నారు. ఎంపీ జునైటా ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ వేడుకల నిర్వహణకు చేయూతనందించిన – ఐసీఐసీఐ బ్యాంక్ కెనడా, రామ్ జిన్నాల, గెట్ హోమ్ రియాల్టీ (రఘు జూలూరి, రమేష్ గొల్లు, ఆనంద్ పేరిచర్ల), తెలుగు ఫుడ్స్, సుష్మ వరదరాజన్, కల్పేష్ పటేల్, కృష్ణ కుమారి కోటేరు, ఎన్‌సిపిఎల్ రాంబాబు, రవికిరణ్ ఇప్పిలి, శాయంతన్ మహేషన్, డా” సౌజన్య కాసుల, మురళి కృష్ణ రాతేపల్లి, అబ్దేల్ బెనుటాఫ్, భరత్ కుమార్ సత్తి, హైదరాబాద్ హౌస్, మధురం, ఇంద్రప్రస్థ రెస్టారెంట్, ఆహా రెస్టారంట్, ప్రాజెక్ట్ సి, బ్రైట్ బెలూన్స్ ఝాన్సీ, జస్ట్ ఇమ్మిగ్రేషన్, ఓటీఎఫ్ ఫుడ్ పార్ట్‌నర్ నవరస ఇండియన్ రెస్టారెంట్, భీమాస్, స్వచ్చిఫై, రేడియో భాగస్వామి-మార్నింగ్ రాగ, శ్రీనివాస్ కళ్లెం, కేశవ్ మందాడి, బాలాజీ రాజగోపాల్, ప్రియలను ఓటీఎఫ్ సమన్వయకర్తలు కలిసి శాలువాలతో సత్కరించారు. ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మొమెంటోలను బహుకరించారు.


ఈ వేడుకల సందర్భంగా స్థానిక వర్తకులను ప్రోత్సహిస్తూ ఏర్పాటు చేసిన విక్రేత కేంద్రాలు కూడా ప్రేక్షకులను ఆకర్షించాయి. కార్యక్రమానికి విచ్చేసిన వారికి రాఫెల్ డ్రా నిర్వహించి 20కి పైగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అయిదుగంటల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఓటీఎఫ్ ఫుడ్ పార్ట్‌నర్స్ నవరస రెస్టారెంట్ సౌజన్యంతో ఉచితంగా రుచికరమైన తెలుగింటి భోజనం, తినుబండారాలు, తేనీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెనడా – ఒంటారియో తెలుగు ఫౌండేషన్ సమన్వయకర్తలు మురళీధర్ పగిడేలా, నివాస్ నారు, శ్రీని ఇజ్జాడ, ప్రవీణ్ నీల, ప్రసాద్ ఘట్టి, చంద్ర చల్లా, దీప-నవీన్ సూదిరెడ్డి, మురళి రెడ్డిచెర్ల, వరలక్ష్మి గంధం, మంజూష చేబ్రోలు, భరత్ వేంకటాద్రి, ఝాన్సీ బదాపురి, మహీధర్ ఆలూరి, కళ్యాణ్ కస్తూరి ఇతర శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
















