Namaste NRI

మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా ఓపల్‌ సుచాత చువాంగ్‌

హైదరాబాద్‌ వేదికగా సాగిన 72వ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో థాయిలాండ్‌ సుందరి ఓపల్‌ సుచాత చువాంగ్‌ శ్రీ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు. మిస్‌ వరల్డ్‌ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని సుచాతా చువాంగ్‌కు ధరింపజేశారు. 3వ రన్నర్ అప్‌ గా మిస్‌ మార్టినిక్, 2వ రన్నర్ అప్‌గా మిస్‌ పోలెండ్, 1వ రన్నర్‌ అప్‌గా ఇథియోపియా నిలిచారు. మిస్‌ వరల్డ్‌గా ఎంపికైన సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించారు సుచాత. ఈ పోటీల్లో మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్‌లు పాల్గొన్నారు. సుచాతకు ప్రపంచ సుందరి కిరీటం దక్కడంతో సొంత దేశం థాయిలాండ్‌లో సంబరాలు అంబరాన్నంటాయి.

అంతకుముందు మిస్‌ వరల్డ్‌ 2025 పోటీల్లో టాప్‌-8 నుంచి మిస్‌ ఇండియా నందిని గుప్తా ఎలిమినేట్‌ అయ్యారు. టాప్‌ 8మందిలో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల సుందరీమణులు నిలిచారు. ఖండాల వారీగా టాప్ ఇద్దరి నుంచి ఒక్కరిని ఎంపిక చేశారు. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి నిర్వాహకులు అవకాశం ఇచ్చారు. ఇక ఈ ఫైనల్ పోటీలకు సోనూ సూద్, సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లండ్ కరీనా జడ్జిలుగా ఉన్నారు. మిస్ వరల్డ్ జడ్జిల ప్యానెల్ హెడ్‌ గా మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లీ ఉన్నారు. ఇక మిస్‌ వరల్డ్‌ జడ్జిల ప్యానెల్ ‌లో రానా దగ్గుబాటి,జయేశ్‌ రంజన్‌ కూడా ఉండటం విశేషం. ఇక సోనూసూద్ కు మిస్ వరల్డ్ హుమానిటేరియన్ అవార్డు లభించింది. ఈ అవార్డును టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి సోనూసూద్ కు అందించారు. తెలంగాణ ఐఎఎస్ అధికారి జయేశ్‌ రంజన్, మాజీ మిస్ వరల్డ్ మనూషి చిల్లర్, సినీనటి నమ్రత శిరోద్కర్, డోనా వ్యవహరించగా, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events