ప్రపంచ ప్రసిద్ధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్‌ఏఐ త్వరలోనే భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ఏడాది చివర్లో దేశ రాజధాని న్యూఢిల్లీలో తన తొలి కార్యాలయం ప్రారంభించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. భారత మార్కెట్లో చాట్‌జీపీటీ వినియోగం భారీగా పెరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్వయంగా ప్రకటించారు.

చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ భారత్ ఒక గ్లోబల్ ఏఐ లీడర్‌గా ఎదిగేందుకు అవసరమైన ప్రతిభ, మద్దతు, మౌలిక సదుపాయాలన్నీ కలిగి ఉంది. ఇండియా ఏఐ మిషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమైనది అని తెలిపారు. భారత్‌లో కార్యాలయం ప్రారంభించడం తమ స్థానిక సేవలను బలోపేతం చేయడంలో తొలి అడుగు అవుతుందని అన్నారు. అయితే, ఈ విషయంపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
















