హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం కల సాకారం కానుంది. గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్న భవన నిర్మాణ పనులను ఎంఈఐఎల్ సంస్థ ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. రెండున్నర ఏళ్లలో పూర్తి చేయనున్నారు.

కొత్త ఆసుపత్రి విశేషాలు : మొత్తం పడకలు 2000. విస్తీర్ణం 32 లక్షల చదరపు అడుగులు. ఆసుపత్రి బ్లాక్` 22.96 లక్షల చదరపు అడుగులు. ఎత్తు `12 అంతస్తులు. 29 మేజర్ ఆపరేషన్ థియేటర్లు. 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు. రోబోటిక్ సర్జరీ థియేటర్లు. అవయవ మార్పిడి యూనిట్. 1500 కార్లకు పార్కింగ్ వసతి. అత్యవసరంలో రోగులను తరలించేందుకు హెలిప్యాడ్. అకడమిక్ బ్లాక్. పురుషులు, మహిళలకు ప్రత్యేక వసతి గృహాలు. మార్చురీ, యుటిలిటీ బిల్డింగ్. సివరేజ్, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ ప్లాంటు. సర్సింగ్, డెంటల్, ఫిజియోథెరఫీ కాలేజీలు. రూప్‌టాప్ టెర్రస్ గార్డెన్. క్రాస్ వెంటిలేషన్ టెక్నాలజీ వినియోగం.
















