Namaste NRI

మా ప్రయత్నం విజయవంతం

ఆకాష్‌ పూరి, గెహనా సిప్పీ నటీనటులుగా దర్శకుడు జీవన్‌రెడ్డి తెరకెక్కించిన చిత్రం చోర బజార్‌. ఈ చిత్రాన్ని ఐటీ క్రియేషన్స్‌ పతాకంపై విఎస్‌ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది సినిమా.   ఈ నేపథ్యంలో యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది. హీరో ఆకాష్‌పూరి మాట్లాడుతూ మాస్‌ హీరోగా మెప్పించాననే పేరు ఈ సినిమాతో తనకు లభించిందన్నారు. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయని తెలిపారు. ఆ క్రెడిట్‌ దర్శకుడు జీవన్‌రెడ్డికి ఇవ్వాలన్నారు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోందిన్నారు. దర్శకుడు జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ  గత రెండు చిత్రాలకంటే ఈ చిత్రం చాలా గ్రాండ్‌గా ఉందని చెబుతున్నారని, దానికి కారణం నిర్మాత అన్నారు. ఈ సినిమా బ్యూటీపుల్‌ మెమెరీస్‌ ఇచ్చిందన్నారు. నిర్మాత విఎస్‌ రాజు మాట్లాడుతూ సినిమా కోసం మేము పడిన శమ్రకు మంచి ఫలితాన్ని ఇచ్చారు అని అన్నారు. ఈ కార్యక్రమలో దర్శకుడు జీవన్‌ రెడ్డి, నిర్మాత విఎస్‌ రాజు, సహ నిర్మాత సురేష్‌ వర్మ, గీత రచయిత మిట్టపల్లి సురేందర్‌, యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events