Namaste NRI

ఈ సినిమా విషయంలో మా అంచనాలు నిజమయ్యాయి

విక్రాంత్‌, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం సంతానప్రాప్తిరస్తు. ఈ చిత్రానికి సంజీవ్‌ రెడ్డి దర్శకుడు. నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి. ఆయన నిర్మాతగా నిర్వి హరిప్రసాద్‌ రెడ్డితో కలిసి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మధుర శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ మా చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నది. వచ్చే ఆదివారం వరకు ఏడుకోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం అన్నారు.

దర్శకుడు సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో తమ అంచనాలు నిజమయ్యాయని, ఇన్‌ఫెర్టిలిటీ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పాజిటివ్‌గా అర్థం చేసుకున్నారని అన్నారు. మధుర శ్రీధర్‌ రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించానని, తొలి ప్రయత్నంలోనే నిర్మాతగా విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events