
అక్సా ఖాన్, అలేఖ్యరెడ్డి, కిరణ్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన సందేశాత్మక యాక్షన్ మూవీ ఆర్ కె దీక్ష. డా.ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్‌ని ఆవిష్కరించారు. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ ఈ పోస్టర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. అన్న ఎన్టీఆర్ 50ఏండ్ల క్రితం దీక్ష సినిమా చేశారు. ఇప్పుడు అదే పేరుతో మేం వస్తున్నందుకు గర్వంగా ఉంది. చిన్న సినిమాలకు డిజిటల్ చార్జ్‌లు భారంగా మారాయి. చక్కటి సందేశంతో రూపొందిన దీక్ష లాంటి సినిమాలకు డిజిటల్ చార్జ్‌లు తగ్గించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే గొప్ప సినిమా మా దీక్ష అని దర్శక, నిర్మాత డా.ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. ఇంకా చిత్ర సమర్పకులు డి.ఎస్.రెడ్డి, నటి అక్సాఖాన్, నటి తులసి, నటులు కిరణ్, గురురాజ్, సాయివెంకట్ తదితరులు కూడా మాట్లాడారు.















