అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ టైటిల్ గ్లింప్స్‌ను చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా లాంచ్ చేశారు. మెగా 157 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మన శంకరవరప్రసాద్‌గారు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పండగకు వస్తున్నారు అనేది ఉపశీర్షిక. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాను ఓ ైస్టెలిష్ మాస్ ఎంటైర్టెనర్‌గా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారని విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ చెబుతున్నది. కారు వచ్చి ఆగింది, డోర్ తీసి సిగరెట్ వెలిగిస్తూ, బ్లాక్ సూట్‌లో ఉన్న చిరంజీవి రివీల్ అయ్యారు. కారు దిగి కమాండోల మధ్య నడుస్తుండగా గ్లింప్స్ ప్రారంభమైంది. సిగరెట్ విసిరేస్తున్నప్పుడు టైటిల్ రివీల్ అయ్యింది. అగ్ర నటుడు వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది.

చిరంజీవి కంబ్యాక్ తర్వాత, ఆయన మెగా స్వాగ్‌ను మళ్లీ చూడాలనే ఒక కోరిక నాకెప్పట్నుంచో ఉండేది. ఫైనల్‌గా ఆయన్నలా చూపించే అవకాశం నాకే వచ్చింది. చిరంజీవిగారిని మనమంతా ఎలా చూడాలనుకుంటున్నామో అంతకు రెండింతలు రేపు సంక్రాంతికి చూస్తారు. చిరంజీవిగారి అసలు పేరైన శివశంకరవరప్రసాద్‌లో శంకరవరప్రసాద్‌ని తీసుకొని ఈ సినిమాకు మన శంకరవరప్రసాద్‌గారు అనే టైటిల్ పెట్టాం. గ్లింప్స్‌కి వాయిస్ ఇచ్చిన విక్టరీ వెంకటేశ్‌గారికి థాంక్యూ. ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు. వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో, రేపు పండక్కి చూస్తారు. ఈ గ్లింప్స్ శాంపిలే.. సినిమాలో ఇంకా చాలా వున్నాయి అని అనిల్ రావిపూడి చెప్పారు. ఇంకా నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటి, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో కూడా మాట్లాడారు.
















