Namaste NRI

ఐరాసలో పాక్ కు భారత్ వార్నింగ్

ఐక్యరాజ్యసమితి భద్రత మండలిలో పాకిస్థాన్‌ భారత్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. ఐరాస వేదికలను పాకిస్థాన్‌ దుర్వినియోగపరుస్తోందని, తమ దేశంపై అబద్ధపు తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడిరది. దౌత్య విధానాల ద్వారా అంతర్జాతీయ శాంతి,  భద్రతల నిర్వహణ అనే అంశంపై చర్చ సందర్భంగా భారత్‌ తరపున ఐరాసలో భారత శాశ్వత కౌన్సిలర్‌, న్యాయ సలహాదారు డాక్టర్‌ కాజల్‌ భట్‌ చర్చలో పాల్గొన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ వారికి శిక్షణనిస్తోందన్న విషయం బహిరంగ వాస్తమని, ప్రపంచానికి మొత్తానికి అది తెలుసని అన్నారు. పాకిస్థాన్‌ సహా అన్ని పొరుగు దేశాలతో భారత్‌ సత్సంబంధాలనే కోరుకుంటుందని స్పష్టం చేశారు. అయితే సీమాంతర ఉగ్రవాదంపై అంతే కటువుగా ఉంటామని తేల్చి చెప్పారు.

                పాక్‌లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని, దాని నుంచి దృష్టి మరల్చేందుకే భారత్‌ పై ఆ దేశం విషం కక్కుతోందని మండిపడ్డారు. జమ్మూకశ్మీర్‌ పై పాక్‌ ప్రధాని చేసిన వ్యాఖ్యలకూ కౌంట్‌ ఇచ్చారు. అది ఎప్పటికీ భారత్‌లో భూభాగమేనని కాజల్‌ భట్‌ తేల్చి చెప్పారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను  ముందు ఖాళీ చేయాలని, ఆ దేశం ఆక్రమించిన కశ్మీర్‌ లోని  అన్ని ప్రాంతాలనూ వదిలి వెళ్లాలని హెచ్చరించారు. పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలోనే జరుగుతాయని ఆమె స్పస్టం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events