జైలు శిక్ష పూర్తి చేసుకున్న 20 మంది భారత మత్స్యకారులను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. వీరిని వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించనున్నట్లు లాంధీ జిల్లా జైలు సీనియర్ అధికారులు తెలిపారు. పాకిస్థాన్ జలాల్లో అక్రమంగా చేపలు పట్టారనే ఆరోపణలపై 20 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్నారు. నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న కారణంగా వీరిని జైలు నుంచి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. తమ విడుదలకు కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ జైలులో ఉన్నప్పుడు తమ కుటుంబాలకు రూ.9000 అందించిన మోదీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.














