
పహల్గాం ఉగ్ర దాడిపై జరిగిన అంతర్గత సంప్రదింపుల సమావేశంలో పాకిస్థాన్ తీరుపై ఐరాస భద్రతా మండలి మండిపడింది. ఉగ్రదాడిలో లష్కరే తాయిబా సంస్థ ప్రమేయం ఉందా? అని మండలి సభ్య దేశాలు పాక్‌ను ప్రశ్నించాయి. సమస్యను పాక్ అంతర్జాతీయికరణ చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇటీవల పాక్ జరిపిన అణు పరీక్షలపైనా సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉగ్ర దాడిపై జవాబుదారీగా ఉండాలని పాక్‌ను కోరాయి. పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకొని చంపడాన్ని సమావేశంలో ప్రస్తావించారు.
