పాకిస్థాన్ మూలాలున్న హమ్జా యూసఫ్ యూకే లో చరిత్ర సృష్టించారు. అక్కడ ఒక పెద్ద రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికై యూకేలో ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి ముస్లిం నేతగా రికార్డులకెక్కారు. అంతేకాదు పశ్చిమ ఐరోపాలో ఒక దేశానికి నాయకత్వం వహించిన మొదటి ముస్లిం నేత కూడా. 37 ఏళ్ల హమ్జా తన పోటీదారులను ఓడించి అధికార స్కాటిష్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కాట్లాండ్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. స్కాట్లాండ్ ప్రజలకు గతంలో కంటే ఇప్పుడు స్వాతంత్య్రం అవసరం. మేము స్వాతంత్య్రం అందించే తరం వారిమవుతాము. స్కాట్లాండ్ నేతగా ప్రజల జీవన వ్యయ సంక్షోభ పరిష్కారం, పార్టీలో విభేదాలను అంతం చేయడం, స్వాతంత్ర్యాన్ని పునరుద్ధరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తా’ అని తెలిపారు. ఇదే సందర్భంలో 1960లో పాకిస్థాన్ నుంచి స్కాట్లాండ్ వచ్చిన తమ తాతల గురించి హుమ్జా ప్రస్తావించారు. 1960లో పాకిస్థాన్ నుంచి స్కాట్లాండ్ వచ్చిన మా తాతలు.. తమ మనవడు స్కాట్లాండ్ తొలి మంత్రి అవుతాడని కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చ అని అన్నారు.