![](https://namastenri.net/wp-content/uploads/2025/01/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-4.jpg)
కొత్త సంవత్సర వేడుకల వేళ వరుస దాడులతో అమెరికాలో భయాందోళనలు నెలకొన్నాయి. 24 గంటల వ్యవధిలో మూడు దాడులు జరగడం, దాడులన్నీ ఉగ్రవాద చర్యలనే అనుమానాలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మూడు దాడుల్లో 16 మంది మరణించగా, 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. న్యూఓర్లీన్స్ నగరంలో న్యూ ఇయర్ వేడుకల్లో మొదటి దాడి జరగగా, కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వెగాస్‌లోని ట్రంప్ టవర్ సమీపంలో పేలుడు సంభవించింది. న్యూయార్క్‌లోని ఓ నైట్‌క్లబ్ ముందు మూడో దాడి చోటు చేసుకున్నది. మరోవైపు న్యూఓర్లీన్స్‌లో దాడికి తెగబడ్డ వ్యక్తి ఐసిస్ ఉగ్రవాద సంస్థతో ప్రేరేపితమయ్యాడని పోలీసులు గుర్తించారు. దీంతో మిగతా రెండు దాడులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం, సమన్వయంతో జరిగాయా అనే దిశగా దర్యాప్తు జరుగుతున్నది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/01/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-4.jpg)