అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా కరుణ్ అర్జున్. ఫస్ట్ లుక్ను దర్శకుడు పరశురామ్ పెట్ల విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ రోడ్ థ్రిల్లర్ చిత్రమిది. పాకిస్థాన్ సరిహద్దుల్లో చిత్రీకరణ చేశాం. మూడు పాత్రలతో ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఫస్ట్ కాపీతో సిద్దంగా ఉన్నాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై డా॥ సోమేశ్వరరావు పొన్నాన, బాలకృష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్ నిర్మించారు. మోహన్ శ్రీవత్స దర్శకుడు. సంగీతం రోషన్ సాలూరి, ఛాయాగ్రహణం : మురళీకృష్ణ వర్మన్.














